సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): రెండు సంవత్సరాలు గడిచినా.. జర్నలిస్టులకు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల విషయాల్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీజేయూ జిల్లా కన్వీనర్ ఎం.గిరి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత 20 నెలలుగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయకుండా పాత కార్డులను మాత్రమే రిన్యూవల్ చేస్తోందని, ఆరోగ్య కార్డులు లేకపోవడం వల్ల జర్నలిస్టులు, వారి కుటుంబాలు వైద్య అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గిరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులకు పలుమార్లు అర్జీలు, వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: టీజేయూ జిల్లా కన్వీనర్ ఎం.గిరి
Oplus_16908288