శ్రీరామ కోటి భక్త సమాజం ఆధ్వర్యంలో టీజేయూ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తికి ఘన సన్మానం

శ్రీరామ కోటి భక్త సమాజం ఆధ్వర్యంలో టీజేయూ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తికి ఘన సన్మానం

జర్నలిస్టుల సేవలు సమాజానికి ఆదర్శం అవసరం

భక్తి, సేవా భావంతో జర్నలిజం సాగాలి

సత్యం అంకితభావమే నిజమైన భక్తి

ప్రశ్న ఆయుధం గజ్వేల్, అక్టోబర్ 24:

శ్రీరామ కోటి భక్త సమాజం ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ (టీజేయూ) జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తికి ఘన సన్మానం జరిగింది.

ఇటీవల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షునిగా మరాఠీ కృష్ణమూర్తి ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే

శ్రీరామ కోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ, “సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేమనీ. వారు సమాజసేవకులు, సత్యసంధులు. ప్రజల సమస్యలు, సామాజిక అన్యాయాలు, ప్రభుత్వ వైఫల్యాలు వెలుగులోకి తెచ్చి సమాజాన్ని మేల్కొల్పే బాధ్యత జర్నలిస్టులదన్నారు.

ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చూపించేది జర్నలిస్టులే” అని అన్నారు.

, “దేశంలో భక్తి ధర్మం వెళ్ళు వెళ్ళేలా ప్రతి జర్నలిస్టు కూడా భక్తి మార్గంలో నడవాలి. భక్తి అంటే కేవలం పూజలు కాదు, భగవంతుని నమ్మకం, సత్యానికి అంకితభావం. భక్తితో నిండిన మనసు కలిగినవారికి మానసిక ధైర్యం వస్తుందన్నారు.

ధైర్యంతోనే వ్యక్తి, సమాజం, దేశం ఎదుగుతుంది. భక్తి మార్గంలో నడిచే జర్నలిస్టులు ప్రజలకు నిజమైన మార్గదర్శకులు అవుతారు” అని తెలిపారు.

ఈ సందర్భంగా టీజేయూ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ, “జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వారి గౌరవం, భద్రత కోసం టీజేయూ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు

టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ సమాజానికి వెలుగునిచ్చే జర్నలిస్టులు భక్తి, సేవా భావంతో నడిస్తే సమాజం సన్మార్గంలో సాగుతుందన్నారు. జర్నలిజం అంటే కేవలం వార్తల సేకరణ కాదు, అది సేవా ధర్మం. భక్తి, నిజాయితీ, ధైర్యం — ఈ మూడు విలువలతో పని చేస్తే ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది” అన్నారు.

“టీజేయూ జర్నలిస్టుల అండగా మాత్రమే కాదు, బహుజన హక్కుల పరిరక్షణలో కూడా పటిష్ఠంగా నిలుస్తుంది. ధార్మిక, సామాజిక, ప్రజా అంశాల్లో సమన్వయం అవసరం ఉంది. ఆ దిశగా భక్త సమాజం చేస్తున్న సేవలు ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు గుడాల శేఖర్ గుప్తా ప్రధాన కార్యదర్శి ఎల్లంరాజు , బైరి ప్రభాకర్, రుద్రారం శ్రీకాంత్, భాను గౌడ్, తలకొక్కుల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment