టిజేయూ నేతకు పరామర్శ
ప్రశ్న ఆయుధం కరీంనగర్: టెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టిజేయూ) నేత పెంటి రాజేందర్ మాతృమూర్తి దశదిన కర్మ సందర్భంగా టిజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు, ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి భరత్‌కుమార్ శర్మ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిజేయూ ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి కనకరెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు వల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.