సంగారెడ్డి, డిసెంబర్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు విజయవంతంగా పూర్తైన సందర్భంగా జిల్లా టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి (అదనపు జిల్లా ఎన్నికల అధికారి) జానకి రెడ్డి, ఆర్డీవో రాజేందర్ లకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు జావేద్ అలీ, జిల్లా సెక్రటరీ రవి ఆధ్వర్యంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు సందిల బలరాం, టీఎన్జీవో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకటరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, విజయకుమార్, సంగారెడ్డి జిల్లా ఫోరం కార్యదర్శి దినేష్, అలాగే మల్లికార్జున్, యాదయ్య, బషీర్, సుమన్, సాయి, ప్రసాద్, తహసీల్దార్లు పరమేశం, దేవదాస్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో అత్యంత నిబద్ధతతో పని చేసి, ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే ఎన్నికల విధుల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శులు చేసిన అన్ని రకాల ఖర్చులను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని వారు కోరారు. గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.
అధికారులకు సన్మానించిన టీఎన్జీవో నాయకులు
Oplus_16908288