సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ అన్నారు. మంగళవారం రాష్ట్ర టీఎన్జీవోస్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎం.హుస్సేనీ అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత చర్చ నిర్వహించారు. ముఖ్యంగా పీఆర్సి అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) రద్దు అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ జావిద్ అలీ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పీఆర్సి అమలు చేసి, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఏకాభిప్రాయ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ
Oplus_16908288