*వికలాంగులకు వృద్ధులకు తప్పని తిప్పలు*
*పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలంటే 18 మెట్లు ఎక్కాలి*
కొడిమ్యాల జనవరి 09.
మండల కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ ఎత్తయిన ప్రాంతం మెట్లు ఎక్కువగా ఉండటం వలన వృద్ధులు,వికలాంగులు,నడవలేని పరిస్థితిలో ఉన్నవారు,అనారోగ్యంతో ఉన్నవారు,దరఖాస్తు ఇవ్వడానికి మెట్లపై ఎక్కి వెళ్లడం చాలా ఇబ్బంది అవుతుందని గతంలో ఉన్న అధికారులు స్టేషన్ పై వరకు వాహనం వెళ్లే విధంగా సిసి రోడ్డు,ఏర్పాటు చేసి ప్రజలకు దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాటుపడినారు.కానీ ఇప్పుడు ఉన్న ఎస్సై సందీప్ స్టేషన్ మార్గ మధ్యలో భారీ గేట్లు ఏర్పాటు చేయడం వలన వాహనాల పైన వెళ్ళలేక వాటిని మధ్యలో పార్కింగ్ చేసి మెట్ల మార్గాన మెట్ల ద్వారా వెళ్ళవలసి వస్తుంది కానీ వికలాంగులు,నడవలేని స్థితిలో ఉన్నవారు,వృద్ధులు,అనారోగ్యంతో ఉన్నవారు,మెట్ల మార్గాన దరఖాస్తు ఇవ్వడానికి వెళ్లాలంటే చాలా అసౌకర్యంగా ఉండి నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది అయినా కూడా ఎస్సై సందీప్ కనికరించకపోవడం చాలా బాధాకరంగా ఉందని వికలాంగుల్లో మరియు గ్రామస్తులు ప్రజలు అనుకుంటున్నారు.దారి మధ్యలో ఉన్న భారీ గేట్లు తీసి ఫిర్యాదుదారుల వాహనాలు స్టేషన్ పై వరకు వెళ్ళినట్లయితే వికలాంగులకు,వృద్ధులకు,నడవలేని స్థితిలో ఉన్నవారికి,ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు, గ్రామస్తులు,చర్చించుకుంటున్నారు.
Post Views: 9