కలకత్తాలో  అత్యాచారం చేయబడ్డ వైద్యురాలికి న్యాయం చేయాలని

IMG 20240825 WA2387

సిఐటియూ అల్లూరు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో

సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు, చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి.

కలకత్తా ఆర్జీకార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని, అత్యాచార నిందితులను, నిందితులను కాపాడాలనుకే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని, దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు ఇచ్చారు.

బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలలో స్పష్టమైందని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు , అవయవాల అమ్మకం,బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పై   ముక్కుమ్మడి దాడిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ ఘటన తర్వాత కూడా వేలమంది మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలకు పురుషాధిక్యత కలిగిన భావజాలం కారణంగా నిలుస్తుందని, మహిళలు ఇంటికే పరిమితం అవ్వాలి, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఆ టైం కి అక్కడ ఎందుకు ఉండాలి అనే ప్రశ్నలు విధించే వారందరిదీ అత్యాచార నిందితుల మనస్తత్వాలతో సరిపోలుతుందని తెలిపారు. బిల్ కేస్ భాను కేసులో అత్యాచార నిందితులను విడుదల చేసి సన్మానించిన ఘనత బిజెపి నాయకులకే చెందుతుందని, దేశానికి వన్నెతెచ్చిన రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా బిజెపి నాయకులేనని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఎన్ని చట్టాలు చేసినా అమలు చేసే రాజకీయ నాయకుల మెడళ్లలో విష పూరిత ఆలోచనలు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారతాయని, అత్యాచార రహిత భారత దేశాన్ని సాధించాలంటే పురుషాధిక్య మతోన్మాద భవజాలంపై నిత్య పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అదేవిధంగా, సంపూర్ణ  మధ్య నిషేధం, గంజాయి, మాదకద్రవ్యా లారికట్టాలన్నారు.  దోషులు ఎంతటివారినైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, సిహెచ్ డబ్ల్యు సంఘం జిల్లా నాయకులు దాసమ్మ వరలక్ష్మి రాములమ్మ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now