సభ్యత్వంలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవాలి

సభ్యత్వంలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవాలి

– వచ్చే నెలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

– ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి*

– 8800002024 సభ్యత్వ నమోదు నంబర్

బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్

ప్రశ్న ఆయుధం, ఆగష్టు 23, కామారెడ్డి :

బీజేపీ సభ్యత్వ నమోదు -2024 కార్యశాల కార్యక్రమం కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే నెలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, సెప్టెంబర్ 2వ తేదిన  ప్రధాని నరేంద్ర మోది సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేస్తారని, 3 వ తేదిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేస్తారని, అనంతరం 5 వ తేదిన జిల్లాలలో సభ్యత్వ నమోదు ప్రారంభం చేయాలని సూచించారు. 2014లో చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని అధిగమించిన బీజేపీ పార్టీ సభ్యత్వంలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుటుందని అన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలనీ సూచించారు. 8800002024 సభ్యత్వ నమోదు నంబర్ అని ఈ నంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవచ్చని, నమో ఆఫ్ ద్వారా, ఒక వేళ ఇవి వీలు కానివారు సభ్యత్వ నమోదు దరఖాస్తు ఫారం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Join WhatsApp

Join Now