నాడు. నేడు.
నిండుగా నీటితో చిట్యాల చెక్‌డ్యాం కళకళ
నీళ్లు లేక బోసిపోయిన చిట్యాల చెక్‌డ్యాం
వాగులు, వంకల ద్వారా వృథాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది.
2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా రూ.58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యాంలను నిర్మించింది. ఇందులో భాగంగా నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామం వద్ద కూడా 2021లో స్వర్ణ వాగుపై రూ.4.50 కోట్లతో చెక్‌డ్యాంను నిర్మించారు. దీంతో ఇక్కడి వాగులో దాదాపు కిలోమీటరు మేర మండు వేసవిలో కూడా నీరు నిలిచి ఉండేది. వాగుకు ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూముల్లో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది. చెక్‌డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, ఎత్తిపోయిన బోరుబావుల్లో నీరు ఉబికి వచ్చింది.
ఈ సారి వేసవికి ముందే వాగు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నది. వాగుకు ఇరువైపులా సాగు చేసుకుంటున్న రైతులకు శాపంగా మారింది. చెక్‌డ్యాం నిర్మించిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వాగు ఒడ్డునే పంటలు సాగు చేస్తున్న చిట్యాల గ్రామానికి చెందిన రైతు సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదెకరాల భూమిలో నాలుగెకరాలు వరి, ఆరెకరాల్లో మక్క సాగు చేశానని, ఈ సారి వరి చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోయాడు. -నిర్మల్,