*నేడు ఏపీ సీఎం చంద్రబాబు కెబినెట్ సమావేశం*
*అమరావతి:మే 20*
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది… ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చిస్తారు… వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వంద నం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది..
ఎస్‌ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది.. వచ్చే నెల 12తో కూటమి ప్రభు త్వానికి ఏడాది పూర్తవు తుంది.. ఈ సంవత్సర కాలంలో చేసిన కార్యక్ర మాలు ప్రభుత్వ పథకాలు సంబంధించి జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణ.. సభలు ఏర్పాటు చేయడా నికి ప్రభుత్వం రెడీ అవు తోంది..
దీనికి సంబంధించి కేబినెట్‌లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.. అదేవిధంగా వచ్చే నెల 12న ఒక భారీ స్థాయిలో సభ నిర్వహించాలనే ఆలో చనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
ఇక, ఉద్యోగుల బదిలీలు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా కేబనిఎట్‌లో ప్రధానంగా చర్చ జరగనుంది.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించిన పలు ప్రాజెక్టు లకు.. కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. రాష్ట్రంలో గల కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు.
మున్సిపల్ చట్టానికి సంబంధించి కొన్ని సవరణలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.. రాజధాని నిర్మాణ పనులు, ఇతర అంశాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణం వీటికి సంబం ధించి కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.. కేబినెట్ సమావేశం తరువాత తాజా రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం ఉంది..