నేడు ఆసియా సోక్రటీస్ ఆధునిక విప్లవవాది ద్రావిడ ఉద్యమ పితామహులు ఈ వి పెరియార్ 146 వ జయంతి…..
స్థానిక భద్రాచలం మదర్ తెరిసా కళాశాల నందు స్వయ గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఆసియా సోక్రటీస్, సామాజిక, సాంఘిక ఉద్యమకారులు, ఆధునిక విప్లవాది,హేతువాది , స్ర్తీ వాది ,సామాజిక న్యాయం, సమానత్వం, స్వయ గౌరవ పోరాటవాది ద్రావిడ ఉద్యమ పితామహులు పెరియర్ రామస్వామి 146 జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత మహాజన సోషలిస్టు పార్టీ
పెరియార్ తన భావాలను సూటిగా చెప్పేవారని,పెరియార్ తన స్వంత ఆస్తినీ,వ్యక్తిగత సౌఖ్యాలనూ సమాజం కోసం త్యాగం చేసారని, ప్రజలు పెరియార్ ని (తమిళంలో పెరియార్ అనగా తండ్రి అని అర్థం) అని పిలుచుకునేవారని,.హిందూ సమాజంలో ఆత్మగౌరవం లేదని, దేవుడు, పూజలు,మూఢనమ్మకాలు తప్పితే ఎక్కడా సమానత్వం లేదని, కులతత్వం,బ్రాహ్మణ పూజారి వ్యవస్థ దోపిడీ ఇవే ఉన్నాయని, మానవత్వం లేదని,.సాటి మనిషి బాధను పట్టించుకోకుండా అతని కులం గురించి ఆలోచించే మనుషులు ఉన్న హిందూ సమాజంలో దేవుడు లేడని ,బ్రాహ్మణ భావజాలంపై పెరియార్ పోరాటం చేశారని గుర్తు చేశారు.తన ప్రజలకు సామాజిక న్యాయం నిరాకరించే సమాజం ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడే శక్తి గల నాయకులను సృష్టించ లేదని,రాజకీయ ఆత్మ గౌరవం,సాంఘిక ఆత్మ గౌరవం చెట్టపట్టాలు పట్టుకొని సాగుతాయని ఆ రెండూ ఒకటి లేకుండా మరొకటి అభివృద్ధి చెందవని.మనం సాంఘిక ఆత్మ గౌరవం సాధించినట్లయితే రాజకీయ ఆత్మ గౌరవం దానితో పాటే వస్తుందని. పెరియార్ అన్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, పెరియర్ ఆలోచన విధానాలతో విద్యార్థులు పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయుడు, కే నిహాల్, ఇసంపల్లి ముత్యం మదర్ తెరిసా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.