నేడు జాతీయ లోక్ అదాలత్

నేడు జాతీయ లోక్ అదాలత్

 

– జిల్లాలో  8 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు

 

– ప్రశ్న ఆయుధం కామారెడ్డి 12 సెప్టెంబర్

 

తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ను 13-09-2025 (రెండవ శనివారం) నాడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కామారెడ్జి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 8 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేయబడ్డాయనీ, అందులో యెల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుండా కోర్టుల్లోను బెంచీలు ఏర్పాటుచేయబడి, ప్రజలకు సమయానుకూలంగా, తక్కువ ఖర్చుతో, సఖ్యతతో న్యాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు. లోక్ అదాలత్ అనేది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతి అని, సాధారణంగా కోర్టులలో కేసులు చాలాకాలం కొనసాగుతుంటాయనీ, దీని వలన సమయం, డబ్బు, శ్రమను కోల్పోతాము. లోక్ అదాలత్‌లో అయితే వివాదాలు త్వరగా పరిష్కరించబడతాయి, దీని వలన రెండు పక్షాలకూ శాంతి, న్యాయం లభిస్తుంది.సివిల్ కేసులు – భూవివాదాలు, ఒప్పందాలు, సొసైటీ వివాదాలు మొదలైనవి, ఫ్యామిలీ, మ్యారేజ్ సంబంధిత వివాదాలు – విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ మొదలైనవి,బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు సంబంధించిన రుణాలు, రికవరీ కేసులు వాహన ప్రమాద పరిహార (ఎం ఎ సి టి) కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు (రాజీ చేసుకోవచ్చిన చిన్న క్రిమినల్ కేసులు) విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇతర పబ్లిక్ యుటిలిటీ సర్వీసుల వివాదాలు. ఇతర పరిష్కరించగలిగే కేసులు. కోర్టులలో సంవత్సరాల తరబడి కొనసాగే కేసులు ఇక్కడ ఒక రోజులోనే పరిష్కరించబడతాయన్నారు.ఇరు పక్షాల సమ్మతితో కేసులు పరిష్కరించబడతాయి. లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమైతే, చెల్లించిన కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది.

Join WhatsApp

Join Now