కెసిఆర్ త్యాగఫలమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం.

కెసిఆర్ త్యాగఫలమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన నేత కేసిఆర్.

బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

కెసిఆర్ త్యాగఫలమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన నేత కేసిఆర్ మాత్రమేనని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అమరులస్థూపానికి నివాళులర్పించి అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే “గువ్వల బాలరాజు మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష దివాస్ చేపట్టడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని, కేసీఆర్ దీక్ష దివస్ త్యాగ ఫలమే ఈనాటి తెలంగాణ అని గుర్తు చేశారు.

గతిని మార్చిన ఉద్యమనేత కేసీఆర్ గారని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేశారని ఈ దీక్ష దివస్ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి తెలంగాణకు రక్షణ కేసీఆర్ గారే అని ఆనాటి గొప్ప దీక్ష దివస్ రోజుని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణం కట్టుకొని మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు విజయ సింహ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment