*నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు*
హైదరాబాద్:ఫిబ్రవరి 02
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినా బాటపట్టారు. ఫిబ్రవరి 2,3తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ఉదయం ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఈ ఎన్నికలు 5వ తేదీన జరుగుతాయి. అందుకే 3సాయంత్రం వరకు ప్రచారానికి సమయం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నామమాత్రంగానే ఉన్నా..ఆ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపిం చగలదు అంటున్నారు.
అందుకే కాంగ్రెస్ తరపున ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఏపీ నుంచి బయలు దేరి వెళ్తారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.
కాబట్టి చంద్రబాబు బీజేపీ తరపున ఢిల్లీలో ప్రచారం చేయబోతున్నారు. తెలుగువారు ఉన్న చోట ఈ ప్రచార ర్యాలీ సాగ నుంది. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీలు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంల మధ్య ఎలాంటి శత్రుత్వ మూ లేదు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు శిష్యుడిగా ఆయన పార్టీలో ఉన్నారు.
ఇప్పటికీ ఆ అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ..పూర్తి వ్యతిరేక గళం వినిపించ బోతు న్నారు.
బద్ధశత్రువుల్లా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తరపున వీళ్ల ప్రచారం సాగనుంది. ఇక వీరిద్దరూ కూడా భిన్న మైన వాదనలను తమ ప్రచారంలో వినిపిస్తారు.