నేటి యువతకు సామాజిక అంశాలపై అవగాహన
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 25
మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
యువత పెడదారి ప్రేమలు మోసాలు మాదక ద్రావ్యాలు.సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదలు సామాజిక అంశాల పై అవగాహన కార్యక్రమం.
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M.రాజేష్ చంద్ర IPS ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం మద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామారెడ్డి సబ్-ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సూచన మేరకు నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరాల టోల్ ఫ్రీ No.1930 షి టీమ్స్ సభ్యులు PC.భూమయ్య అవగాహనా కల్పించారు టోల్ ఫ్రీ No.8712686094 అత్యవసర సమయంలో DAIL100 కాల్ చేయాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదకద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి నిర్మూలన, అలాగే మహిళలు చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలుపై మానవ అక్రమ రవాణా సేల్ ఫోన్స్ యూట్యూబ్,ఇంస్టాగ్రామ్ ,ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి U.శేషరావు PC.సాయిలు.పాటలు మాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ప్రైమరీ స్కూల్ HM రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.