Headlines:
-
తోగ్గుడెం అక్రమ మైనింగ్ పై చర్యలు కోరుతూ సేవాలాల్ సేన వినతి పత్రం
-
భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి సేవాలాల్ సేన వినతి
-
గిరిజన హక్కుల రక్షణ కోసం తోగ్గుడెం క్వారీలపై చర్యలు చేపట్టాలి
గిరిజన చట్టాలను రక్షించాలి
*భద్రాచలం ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేత*
*సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు*
*మాలోత్ శివ నాయక్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు మాలోత్ శివ నాయక్ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి తోగ్గుడెం అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోవాలనీ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాలోత్ శివ నాయక్ మాట్లాడుతూ పాల్వంచ మండలం తోగ్గుడెం
గ్రామపంచాయతీ పరిధిలోనీ 1/70 1/59 పీసా చట్టాలు తుంగలో తొక్కి గిరిజనేతరలు లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ యజమానులు పెద్ద పెద్ద బాంబులతో బ్లాస్టింగ్ లను నిర్వహిస్తున్నారని వాటి వల్ల వచ్చే కాలుష్యము ధూళిలతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని బ్లాస్టింగ్ చేయడం వాళ్ళ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఇండ్లు పూర్తిగా పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆ బాంబుల వలన భవిష్యత్తులో ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు క్రషర్ యజమానులు రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో లారీలను పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్వారీలను కుంటలను పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారని వాటి వల్ల క్వారీలలో నీళ్లు నిలువ ఉండటం రైతులకు పంటలు పండటం లేదని వ్యవసాయ మోటార్లు నీరు అందడం లేదని అన్నారు తోగ్గుడెం పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన గ్రామాలు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తవ్విన క్వారీలను చుట్టూ ఫెన్సింగ్ తీగలు లేకపోవడం వల్లనే అనేక పాడి పశువులు ప్రమాదాలకు గురై చనిపోవడం జరిగిందన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ క్వారీలను తక్షణమే నిలుపుదల చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు ధరవత్ కృష్ణ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా నాయకులు యోగి నాయక్ నరేష్ నాయక్ సంతోష్ నాయక్ పాల్వంచ మండల అధ్యక్షులు జర్పుల పరామేశ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ కిషోర్ రామకృష్ణ గిరి తదితరులు పాల్గొన్నారు