Headlines:
-
అత్యధిక పన్నులు చెల్లించిన హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్
-
2023-24 ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ లీడర్‌గా షారుక్
-
అల్లు అర్జున్ పన్ను చెల్లింపులతో టాప్ లిస్టులో
-
టాలీవుడ్ నుంచి అత్యధిక పన్ను చెల్లించిన హీరో ఎవరో తెలుసా?
-
ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ట్యాక్స్ జాబితా విశేషాలు
అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే?
2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించిన సినీ ప్రముఖుల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 92 కోట్ల పన్నులు చెల్లించిన షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండొవ స్థానంలో విజయ్ రూ. 80 కోట్లు, మూడోవ స్థానంలో సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు పన్ను చెల్లించారు. ఇక తెలుగులో అల్లు అర్జున్ 2023-24లో ఏకంగా రూ. 14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.