Site icon PRASHNA AYUDHAM

కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండమే..!

IMG 20241220 WA0124

కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్నిగుండమే..

-రూ.55 కోట్లతో రూ .700 కోట్ల రాబడి

-హైదరాబాదుకు ప్రపంచస్థాయి గుర్తింపు

-సీనియర్ ఉద్యమకారుడు అందే సుభాష్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ను ముట్టుకుంటే అగ్గిగుండమే అవుతుందని సీనియర్ ఉద్యమకారుడు అందే సుభాష్ హెచ్చరించారు

. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  కేంద్రంలోనిబీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. అక్రమంగా ఏసీబీతో కేసులు పెట్టించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను ఎదుర్కోలేక రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఈడి తదితర సంస్థలను వేట కుక్కల్లా వాడుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ ప్రజల ముందు ఉంచుతున్నందుకు కక్ష కట్టి కేసులు పెట్టడం జరుగుతుందని జైలుకు పంపిస్తేనే కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడితే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ విసిరిన స్వీకరించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది ఏమీ లేదని ప్రజలకు ఓరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని, మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2500 ఏమైందని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి కొందరు మరణించారని, మరికొందరు ఆసుపత్రుల పాలయ్యారని, నేడు ఘట్కేశ్వర్లో గురుకుల పాఠశాలలో ఫుడ్ ఫైజన్ కావడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజా పాలన గాలికి వదిలి అధికారం ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్ రేస్ లోరూ .55 కోట్లు పెట్టుబడి పెట్టి సుమారు రూ.700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడం జరిగిందని, ప్రపంచ స్థాయిలో జరిగే ఈ రేసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కొరకు హైదరాబాద్ కు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాదుకు ఐటీ హబ్బు ద్వారా బెంగుళూరు, ముంబాయి, పూణేను తల దన్నే విధంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని కితాబిచ్చారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్, పట్టణప్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, నాయకులు ఎనగందుల నరసింహులు, అనసూయ మాజీ ఎంపిటిసి ఎస్టీ సె లుజిల్లా నాయకులు అజ్మేరా తిరుపతి నాయక్, హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సిత్యా నాయక్, ఎనగందుల బాబు, బాల్సింగ్ సురేస్ నాయక్ యువజన నాయకులు జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version