Site icon PRASHNA AYUDHAM

కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన టూరిజం పార్కు లను ప్రజల్లోకి ఉపయోగపడితే ఇవ్వాలి

IMG 20240825 WA03301

కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన టూరిజం స్పాట్లను పార్క్ లను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలి

గజ్వేల్ ఆగస్టు 25 ప్రశ్న ఆయుధం :

గత ప్రభుత్వంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ముఖ్యమంత్రి నియోజకవర్గం కేంద్రం కావడంతో కోట్ల ఖర్చుతో గజ్వేల్ ప్రాంతంలో టూరిజం స్పాట్లుగా నిర్మించిన చెరువులను, పార్కు లను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పట్టింపులకు పోకుండా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి డిమాండ్ చేసినారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాండవుల చెరువు టూరిజం స్పాటును సిఐటియు బృంద సభ్యులతో సందర్శించి అక్కడ ఉన్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పరిశీలించినారు కోట్లతో ఖర్చుపెట్టి ప్రజలకు,పిల్లలకు వినోదాలకు ఉపయోగపడే ఆట వస్తువులు పూర్తిగా పాడై నిరుపయోగంగా ఉన్న వాటిని పరిశీలించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో టూరిజం స్పాట్లను,పార్కులను కోట్లలో నిధులు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగిందని వాటిని ఉపయోగంలో ఉంచకపోవడం, వాటి పనులు అసంపూర్తిగా ఉండడం వలన వృధాగా నిరుపయోగంగా మారి కోట్లాది ప్రజల సొమ్ము వృధా అయ్యే అవకాశం ఉన్నదని అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న టూరిజం స్పాట్ల పనులను పార్క్ ల యొక్క పెండింగ్ పనులను గజ్వేల్ పరిసర ప్రాంతంలోని మిగతా అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు మంజూరు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేసినారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన పనులలో కోట్లాది రూపాయలలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే విచారణ చేసి వెలికి తీయాలని పెండింగ్ లో ఉన్న పనులకు నిధులను విడుదల చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తేవడం ద్వారా ప్రభుత్వ సొమ్మును వృధాకానివ్వకుండా చూడాలని కోరారు ఈ పరిశీలన బృందంలో సిఐటియు మండల కన్వీనర్ సందిటి రంగారెడ్డి, నాయకులు సాధు రవికుమార్, కొట్టాల యాదగిరి పాల్గొన్నారు.

Exit mobile version