టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించాలి

టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించాలి

కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కిష్టయ్య

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 27, కామారెడ్డి :

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో టూరిజం డే సందర్భంగా టూరిజం గురించి మాట్లాడుతూ… భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాలు టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరముందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కిష్టయ్య అన్నారు. కళాశాలలో హిస్టరీ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో జరిగిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి, వరల్డ్ టూరిజం డే సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు టూరిజం రంగం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, భవిష్యత్తులో ఈరంగంలోను, దీనికి అనుబంధ రంగాలలోను అనేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన చరిత్ర అధ్యాపకులు జయప్రకాశ్ మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక దేశాలు పర్యటక రంగంను ముఖ్య ఆర్థికవనరుగా తయారు చేసాయని, ఈ రంగం అభివృద్ధికి భారతదేశం ఇంకా కృషి చేయవలసిందన్నారు. ప్రపంచ పర్యాటక రంగంలో భారతదేశం 39వ స్థానంలో ఉందని, ఆ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. రాములు, డా. శ్రీనివాస్, డా. మల్సూర్, కవిత, సత్యశ్రీ, విజయ్, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

Join WhatsApp

Join Now