పర్యాటకులపై ఉగ్రదాడి పిరికిపందల చర్య!

పార్వతీపురం,, సిపిఐ జిల్లా కార్యాలయం 23-04-2025

పర్యాటకులపై ఉగ్రదాడి పిరికిపందల చర్య!

తోట జీవన్న

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిది 23-04-2025(ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో నిన్న జరిగిన ఉగ్రవాద దాడిని పిరికిపంద చర్య అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న దుయ్యాపట్టారు. అన్యం, పుణ్యం ఎరగని అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. ప్రాణం విలువ తెలియని కిరాతక హంతకుల దుష్ట చర్యలను సమస్త సమాజం ఖండించాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేతగానితనం కారణంగానే ఉగ్ర దాడులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ఉగ్రవాదులు ఎక్కడో దాక్కొని అమాయకులైనటువంటి ప్రజల పైన తుపాకీ తూటాలు ఎక్కువ పెట్టడం నీతిమాలిన చర్య అని విరుచకబడ్డారు. మానవత్వం ఉన్న వారెవరు ఇలాంటి చర్యలు చేపట్టరని తెలిపారు. ఇలాంటి ఉగ్రమూకలను తప్పకుండా సరైన సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు, కాలక్షేపాన్ని వదిలేసి భారతీయుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. కిరాయి మూకల, హంతక ముఠాల తుపాకీ గుండ్లకు బలైన వారికి ప్రగాడ సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. క్షత్రగాత్రులకి ఉన్నత స్థాయి వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరు కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, రాజేష్,బాబు తదితరులు పాల్గొన్నారు,,,

Join WhatsApp

Join Now