టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యమా..? రాజకీయ నాయకుల ప్రలోభాలా..?

ఎవరు బాధ్యులు..?

కామారెడ్డిలో జల విలయానికి అసలు కారణం ఎవరు..?

టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యమా..? రాజకీయ నాయకుల ప్రలోభాలా..?

లేక స్వార్థపరుల కబ్జా మేధావుల దౌర్జన్యమా..?

రోడ్లను కుదించి మురికికాలువల నిర్మాణానికి అడ్డుకట్ట

కోర్టు కేసులు వేసి పనులు ఆపేసిన స్వార్థపరులు..!

కామారెడ్డిలో జలవిలయం వెనుక నిజాలు

కామారెడ్డి పట్టణం ఇటీవల ఎదుర్కొన్న జలప్రళయం వెనుక అనేక ప్రశ్నలు లేవుతున్నాయి. ఎవరు బాధ్యులు..? ప్రజల ప్రాణాలు, ఆస్తులు ముప్పుకు గురయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది అసలు ప్రశ్న.

జన్మభూమి రోడ్, విద్యానగర్, నిజాంసాగర్ రోడ్, స్టేషన్ రోడ్… ఏ వాడూ మినహాయింపు కాదు. ఒకప్పుడు 100/80 అడుగుల వెడల్పుతో ఉన్న రోడ్లు… స్వార్థపరుల కబ్జాలతో 50/40 అడుగులకు కుదించబడ్డాయి. రోడ్ల స్థలాన్ని ఆక్రమించి భవనాలు కట్టుకోవడంతో మురికికాలువల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.

“లేఅవుట్ ప్రకారం రోడ్లు నిర్మిస్తేనే ఫండ్స్ వస్తాయి, లేకుంటే మురికికాలువలు నిర్మించలేం” అంటూ మునిసిపల్ అధికారులు చేతులెత్తేశారు. మరోవైపు ప్లాట్ల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించి కట్టుకున్న మహానుభావులు… కోర్టు కేసులు వేసి మురికికాలువల పనులను అడ్డుకున్నారు.

దేవుడి దయ వల్ల ప్రాణనష్టం జరగలేదు. కానీ ఇలాంటివి పునరావృతమైతే కబ్జాదారులు మాత్రమే కాక, నిరపరాధుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కనుక ఇప్పటికైనా నిజాయితీ, నిబద్ధత, నైతికతతో కబ్జాలను తొలగించి మురికికాలువల నిర్మాణానికి సహకరించాల్సిన అవసరం ఉంది.

ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు కళ్లెదుట సమస్యను అంగీకరించి పట్టణం మనుగడ కోసం చర్యలు తీసుకోవాలి.

✍️ మురికికాలువలు లేని కాలనీల వాసుల విన్నపం

Join WhatsApp

Join Now

Leave a Comment