నాగారంలో పెచ్చుమీరుతున్న అక్రమ కట్టడాలు: టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆరోపణలు
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16
అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు:
* స్టిల్ట్ ప్లస్ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని, పార్కింగ్‌కు కేటాయించాల్సిన స్టిల్ట్ ఫ్లోర్‌ను పూర్తిగా కమర్షియల్ షాపులుగా మార్చేస్తున్నారు.
* పాత ఇళ్లపై కొత్త అనుమతి తీసుకొని, పాత ఇంటిని కూల్చకుండానే రెండు అంతస్తులు వేసి, దానిపై “పెంట్ హౌస్” పేరుతో అదనంగా మరో అంతస్తు కడుతున్నారు. పాత ఇళ్లపై కొత్త నిర్మాణాలు చేపట్టాలంటే కొత్త పర్మిషన్ తప్పనిసరి అయినప్పటికీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు లంచాలకు బానిసలయ్యారని, అందుకే ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకుని, వారిని విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.