Site icon PRASHNA AYUDHAM

గాంధీ భవన్ లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం

కాంగ్రెస్
Headlines
  1. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు: మహేష్ కుమార్ గౌడ్, కొప్పుల రాజు, బెల్లయ్య నాయక్
  2. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి
  3. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
  4. నాగార్జున సాగర్‌లో ఆదివాసీ క్యాంపు: ప్రభుత్వ పనులపై చర్చ
  5. ఆధునిక సంక్షేమ పథకాలు: బీఎస్ఎస్, బీజేపీ పై కాంగ్రెస్ వ్యతిరేకత

గాంధీ భవన్ లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ అధ్యక్షులు… 

కష్టపడ్డ నాయకులకు తప్పకుండా పార్టీలో గుర్తింపు ఉంటుంది.

కింది స్థాయి నాయకుల కష్టంతోనే మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాము..

రాబోయే అన్ని రకాల పదవులలో నాయకులకు అవకాశాలు ఇస్తాము.

బిఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు దోచుకున్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి నాశనం చేసిన చరిత్ర బిఆర్ఎస్ వాళ్ళది.

కేసీఆర్ కుటుంబం తో సహా బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని నాశనం చేశారు.

8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా దివాళా తీశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం..

మనం ఎన్ని మంచి పనులు చేసిన బిఆర్ఎస్ మనపై అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుంది 

మనం గ్రామాల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున ప్రచారం ఇవ్వాలి.

మనం చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతాం..

బిఆర్ఎస్, బీజేపీ లు మనపై చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలి.

రైతు బంధు ఇచ్చాము.. రైతు రుణమాఫీ కోసం 18 వేల కోట్లు కేటాయించాము. ఇంకా 3 వేల కోట్లు ఇస్తున్నాం..

50 వేల ఉద్యోగాలు 10 నెలలలో ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది.. 10 ఏళ్లలో చేయలేని పనులు మనం చేసాము. 

ఇచ్చిన హామీల.ప్రకారం బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేసాము.. ఇవన్నీ ప్రజల్లోకి తీస్కెళ్లాలి..

బీజేపీ మత తత్వ ప్రచారం తో లబ్ది పొందుతుంది. బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోడీ అబద్దాలు తిప్పికొట్టాలి..

రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వాల్సిన అవసరం ఉంది. దేశాన్ని ఒక్కతాటి పై తెచ్చి అభివృద్ధి చేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర చేశారు. 

కులగణన ఎంత అవసరమో ఆయన వివరించి చెప్పి తెలంగాణ లో అమలు చేశారు.

రాహుల్ గాంధీ స్వాతిముత్యం అంత మంచి వాడు, అన్ని రకాల మంచి పనులు చేస్తున్నాడు. ఆయనను దేశానికి పీఎం చేసేందుకు మనం కృషి చేయాలి.

నాగార్జున సాగర్ లో వారం రోజుల పాటు ఆదివాసీ క్యాంపు…

ఆదివాసీ అంశాలపై లోతుగా చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ లో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించనున్నామని ఏఐసీసీ జాతీయ నాయకులు కొప్పుల రాజు తెలిపారు.

రోజుకు 7,8 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి న్నారు..

ఇంకా సమావేశంలో బెల్లయ్య నాయక్ తదితరులు మాట్లాడారు.

Exit mobile version