ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

 ప్రశ్న ఆయుధంకామారెడ్డిజిల్లా అక్టోబర్ 23:

 

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఆటో డ్రైవర్ లడ్డు కుటుంబానికి టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఇటీవల పొందుర్తి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో లడ్డు కుటుంబం తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూ.12,000 సహాయం అందించి, కుటుంబానికి అండగా నిలిచారు.

గతంలో లడ్డు తల్లి ఆరోగ్యం బాగోలేకపోయిన సందర్భంలో కూడా ఆయన ఆర్థిక సాయం చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శంకర్ రావు, పండు శ్రీకాంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment