బీసీ బిల్లుతోనే బడుగు బలహీన వర్గాల మేలు : టీపీసీసీ జనరల్ సెక్రటరీ

బీసీ బిల్లుతోనే బడుగు బలహీన వర్గాల మేలు : టీపీసీసీ జనరల్ సెక్రటరీ

 

బీసీ బిల్లుతో వెనుకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యం

 

వరద బాధితుల పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న హామీ

 

కాలేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతి – సిబిఐ విచారణ అవసరం

 

టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బహిర్గతం

 

వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి

 

కామారెడ్డి, సెప్టెంబర్ 2 (ప్రశ్న ఆయుధం)

బీసీ బిల్లుతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలతో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

కాలేశ్వరం నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిందని తెలిపారు. అంతర్గత విభేదాలతో టీఆర్‌ఎస్ కుదేలవుతోందని, కవిత – హరీష్ రావుల మధ్య ఆరోపణలే దానికి నిదర్శనమని అన్నారు.

తరువాత వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now