పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీపిసిసీ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీపిసిసీ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతాంగం

పట్టణాభివృద్ధి దిశగా కృషి చేయాలని పిసిసి ఆదేశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియతో కలిసి తెలంగాణ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. పార్టీ అధ్యక్షుని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పిసిసి అధినేత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం, సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు చురుకుగా కృషి చేయాలని నాయకులకు సూచించారు. పార్టీ బలోపేతం దిశగా సమష్టిగా ముందుకు సాగాలని, గ్రామీణ స్థాయి నాయకత్వం ప్రజలతో మరింత మమేకం కావాలని ఈ సందర్భంగా సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment