భద్రాచలంలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో సుజాతనగర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లికి చెందిన కొంతమంది గాయపడగా వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, కొందరిని విద్యానగర్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు బానోత్ కోటేష్ నాయక్ అందించిన సమాచారం మేరకు రాష్ట్ర టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ప్రమాదంలో గాయపడ్డ బద్దూ, పరశురామ్, మురళి కృష్ణ, అఖిల్, వీరన్న బాధితులను పరామర్శించారు. బాధితులను అన్ని విధాల అండగ ఉంటామని వారికి మెరుగైన చికిత్స అందిచాలని డాక్టర్ లకు సూచించారు. దైవ కార్యక్రమాల వేళ ఇలా ప్రమాదం జరగడం దురదృష్టకరమని నిమర్జన వేళ భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.