తెలంగాణాలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానం – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.” 

” తెలంగాణాలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ విధానం – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25: కూకట్‌పల్లి ప్రతినిధి

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద కాలనీలోని ఏల్ శోదాయి ప్రార్థన మందిరంలో పాస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ప్రేమ, శాంతి, ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు ప్రతీక అని, ఏసు క్రీస్తు శాంతిదూత అని, అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు. ఎంతటి పాప కార్యాలు చేసిన వాటిని గ్రహించి పశ్చాతాపం చెందితే ఏసు క్రీస్తు క్షమిస్తాడని, అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువని అన్నారు.

IMG 20241225 WA0138

మన మనుగడకు అవసరమైన నీతిసూత్రాలను సులభ శైలిలో బోధించాడని, ఏసు చేసిన అద్భుతాలు అసంఖ్యాకమని, ఏసు యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి ఎంతో దోహదం చేస్తున్నాయని, ఏసు బోధించిన శాంతి సమానత్వం ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఈ లోకం మనుగడకు ప్రపంచ మానవుల శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తున్నాయని అలాంటి మహోన్నతమైన ప్రభువైన ఏసు బాటలో మనందరం పయనించాలని తెలియజెసారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు మీరందరితో కలసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. తెలంగాణాలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమన్నారు. విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవారింటి మస్తాన్ రెడ్డి, కనకయ్య ముదిరాజ్, రవీందర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి నెల్లి, లంక రాజ్ కుమార్, ఆది రెడ్డి, ఆదినారాయణ, సతీష్ రెడ్డి, పల్లపు వేణు, బొంత రవి కుమార్, అప్పారావు, కృష్ణ మూర్తి, మోహన్, జాకిర్, క్రైస్తవ సోదరులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now