” బీసీ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ స‌ర్కారు మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తుంది – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. “

” బీసీ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ స‌ర్కారు మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తుంది – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ”

ప్రశ్న ఆయుధం జులై23: కూకట్‌పల్లి ప్రతినిధి

” కేటిఆర్, హరీష్ రావు మాటలు వింటుంటే రంగులు మార్చే ఊసరవెల్లి లు కూడా సిగ్గు పడతాయి – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ”

” రేవంత్ రెడ్డి యూత్ ఐకాన్ రేవంత్ రెడ్డిని చూసి యువత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు – సత్యం శ్రీరంగం. ”

గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి బిసిలపై నిబద్ధత లేదు అని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అంటుండు, బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానూ ముక్కులు అని బిఆర్ఎస్ సపోర్ట్ తో గెలిచిన బీజేపీ ఎంపీలకు సిగ్గు ఉంటే బిసి బిల్లుకు సపోర్ట్ చేయండి, మోడీ తెలంగాణ పై విషం చిమ్ముతున్నారు సహరించట్లేదు అని, ఇప్పటికైన బీజేపీ నేతలు జిత్తులు మానండి, రాష్ట్ర అభివృద్ధి లో బాగస్వామ్యులు కండి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేసే నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చూపుతోందని,బీఆర్ఎస్‌ పార్టీ అడ్రస్ లేకుండా పోవడంతో పాటు కార్యకర్తలకు కూడా గమ్యం లేకుండా పోయిందని, పార్టీలో అధికారం కోసం లోపాయికారిగా పోరు కొనసాగుతోందని,ప్రజల సమస్యలపైన వారికి దృష్టి లేకుండా పోయిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమానికి చేసిన పనులు ఏమిటో చెప్పాలని,బీసీలపై ప్రేమ ఉంటే బీసీ నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని,ఇప్పటి పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని,కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిందని, పార్టీలో వ్యక్తిగత కోపాలు, ఫిరాయింపులకు చోటు లేకూడదని ఇతర పార్టీలు మనలో ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నిస్తున్నాయని, కార్యకర్తలు అపోహలకు లోనుకాకుండా పార్టీ పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని తెలిపారు. కేటిఆర్ కల్లు తగిన కోతిలాగా మాట్లాడుతుండు కేటిఆర్ కు చెప్పుదెబ్బలు తప్పవు అని అన్నారు. సొంత చెల్లె కవితే కేటిఆర్ మాట వినట్లేదు ముఖ్యమంత్రి పై కేటిఆర్ భాషను సరిదిద్దుకోవాలి కవిత చేసిన లిక్కర్ దందా దేశంలో ఎవరు చేయలేదు అని అన్నారు. కేటిఆర్ ,హరీష్ రావు మాటలు చూస్తుంటే రంగులు మార్చే ఊసరవెల్లి లు కూడా సిగ్గు పడతాయి అన్నారు. రేవంత్ రెడ్డి ప్లైట్ మోడ్ లో ఉండు అని కవిత అంటుంది. అభివృద్ధి కోసం మడమ తిప్పని యోధుడు లాగ ఎన్ని సార్లు అయినా డిల్లికి పోతాడు, మీలాగా అవినీతి సొమ్ముతో కొనుక్కున్న సొంత ప్లైట్ లో డిల్లికి పోవట్లేదు కదా, కేటిఆర్ కు గర్వమే కాదు నోటి దూల,అహంకారం, బలుపు తో అధ:పాతాళానికి పోయిండు అని అన్నారు.కేసీఆర్ కుటుంబంలో నెలకొన్నఅంతర్గత కుమ్ములాట వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొంటున్నది అని, మొదట మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేని మీరు రాష్ట్ర సమస్యలను ఏం పరిష్కరిస్తారు అని ఎద్దేవా చేసారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి, కోదండరెడ్డి, మందకృష్ణమాదిగ వంటి వారిని అరెస్టు చేసిన మీకు ఇవాళ కేసులు, అరెస్టులు అంటే ఎందుకు భయపడుతున్నారు. లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరే బయట తిరుగుతుంటే తెలంగాణ సమాజం మిమ్మల్నెందుకు సహించాలి. మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరం కట్టారని ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. కాళేశ్వరం ఇంత గొప్ప ప్రాజెక్టు అని చెప్పుకున్న వారు ఇప్పుడు ఆ గొప్పతనం మాదే అని చెప్పుకోవడానికి ఒక్కరూ ముందుకు రావడం లేదు అని రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు లేని కారణంగానే కొన్ని పథకాల అమలు ఆలస్యం అవుతోందని త్వరలోనే అన్ని పథకాలు అమలు అవుతాయి అని అన్నారు. తొమ్మిదేళ్లుగా మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ హామీలపై మాట్లాడితే నడువదు అని అన్నారు. బంగారు తెలంగాణ ఏమో గాని రాష్టాని అప్పుల అప్పులపాడు చేసిండు చింతమాడక చింటూ కాక రాష్ట్రాన్ని దివాలా తీసిండు 10 సంవత్సరాలలో ఏది చేసినా స్కాములు తప్ప అభివృద్ధికి నోచుకోలేదు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా దోచుకోవడానికి దాచుకోవడానికా ప్రశ్నిస్తుంది తెలంగాణ ప్రజానీకం అని అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాహుల్ గాంధీ ఆలోచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆలోచనలతో నిబద్ధత తో కులగణన చేసిండు, బిసి బిల్లు కోసం సీఎం రేవంత్ మడమ తిప్పని మాట తిప్పని పోరాట యోధుడుగా పోరాటం చేస్తుండు, రేవంత్ రెడ్డి లీకు వీరుడు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు పోరాట యోధుడు కేవలం 18 సంవత్సరాలలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా అయిండు అని, రేవంత్ రెడ్డి యూత్ ఐకాన్ రేవంత్ రెడ్డిని చూసి యువత రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు వచ్చింది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది రేవంత్ అన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నో ఇంకా ఎన్నో పథకాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అని అన్నారు. బీసీ రిజర్వేషన్లను ఆడ్డుకునే వారి సంగతి బీసీ సంఘాల నాయకులే చూడాలి అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment