పలు గణేష్ మండపాలను సందర్శించిన టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 31: కూకట్‌పల్లి ప్రతినిధి
టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పలు గణేష్ మండపాలను సందర్శించారు.కెపిహెచ్బి కాలనీ, మూసాపేట, అల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను స్థానిక నాయకులతో కలిసి రమేష్ సందర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు.నిర్వాహకులు పలుచోట్ల భక్తులకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రమేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.