సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల పండుగ ఊరేగింపు మహోత్సవం మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. స్థానిక గొల్లగూడెం నుండి అస్తాబల్ లోని ఎల్లమ్మ దేవాలయం వరకు పోతురాజుల నృత్యాలతో, ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. జోగిని అవిక, మహిళలు బోనంతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ ఊరేగింపు మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయారెడ్డి, నాయకులు, గౌడ కుల సంఘ నాయకులు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు: మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Oplus_0