సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కరపత్ర ఆవిష్కరించిన:  టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం 

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కరపత్ర ఆవిష్కరించిన

టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం

ప్రశ్న ఆయుధం,డిసెంబర్ 21కామారెడ్డి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరానికి మద్దతుగా తెలిపిన టిపిటిఎఫ్ జిల్లా నాయకులు

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరానికి హాజరైన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి వారందరికీ మినిమం టైం స్కేల్ ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు టిపిటిఎఫ్ సమ్మెకు మద్దతుగా నిలబడుతుందని, టి పి టి ఎఫ్ కార్యకర్తలు సమ్మె విజయవంతానికి కృషి చేస్తారని తెలిపారు.తోటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మద్దతుగా నిలబడాలని వేదిక సాక్షిగా ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు.

IMG 20241221 WA0057

గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్పీలు, పీటీఏ పీజీ సీఆర్పీలు,బోధనేతర సిబ్బందికి కనీస వేతనం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.ఇదే స్కీములో మండల స్థాయిలో సీఆర్పీలు ,ఎంఐఎస్ కోఆర్డినేటర్లు,జిల్లా డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఇఆర్పిలు, జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టం ఎనలిస్టులు, టెక్నికల్ పర్సన్లు, డిఎల్ఎంటి మెసెంజర్లు ఎంతో కాలంగా హోదాతో నిమిత్తం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నప్పటికీ వారికి కనీసమైన వేతనం లభించడం లేదని తెలిపారు.వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మొదటి పిఆర్సి ఇచ్చిన సిఫారసుల మేరకు కనీస వేతనం కూడా చెల్లించడం లేదు.వెట్టిచాకిరీ విధానాన్ని శ్రమ దోపిడిని అమలు చేస్తూ పోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన కనీస డిమాండ్లను పరిష్కరించే విధంగా చొరవచూపి సమ్మెను నివారించాలని సమ్మె వల్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు నష్టపోతున్నారని , విద్యారంగంలో ఉన్న అనేక రకాల పనులు ఆగిపోతావున్నాయని అన్నారు.

కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు నళిని దేవి,జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నాగభూషణం, ఉపాధ్యక్షురాలు లక్ష్మి,కామారెడ్డి మండల అధ్యక్షులు గ్యార బాబయ్య,ఫెడరేషన్ సీనియర్ నాయకురాలు మీనా భూషణ్

తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now