*ఇసుక ట్రాక్టర్ల పట్టివేత*
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారు వాగు నుండి మంగళవారం ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న గుర్రం శ్రీకాంత్ గౌడ్ మరియు సూర దేవరాజు అను ఇద్దరి వ్యక్తులను పట్టుకుని 2 ట్రాక్టర్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారిద్దరినీ రిమాండ్ చేయడం జరిగిందని తంగళ్ళపల్లి ఎస్సై బి రామ్మోహన్ తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. తంగళ్ళపల్లి మండల పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడునని ఆయన హెచ్చరించారు. ఎస్సై వెంట కానిస్టేబుళ్లు నరేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్ ఉన్నారు.