*ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి*
*జమ్మికుంట మార్చి1 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి ప్రశాంత్ తన ట్రాక్టర్ పై సొంత అవసరాలకు జమ్మికుంటకు వస్తుండగా మార్గమధ్యంలో ధర్మారం వద్ద తన ట్రాక్టర్ యొక్క టైరు పగలడం వలన ట్రాక్టర్ కుడివైపున లాగి ప్రమాదవశాత్తు పక్కనే గల కెనాల్ లో ట్రాక్టర్ తో సహా బోల్తా పడడం వల్ల ప్రశాంత్ యొక్క చాతి పై తీవ్ర గాయాలు అయి తలకు కుడి భాగంలో బలమైన గాయం కావడం జరిగిందని అందుబాటులో ఉన్న వ్యక్తులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడని అని తన భార్య అయిన రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట సిఐ వరగంటి రవి తెలిపారు