చిన్నారుల చేతుల మీదుగా సంప్రదాయానికి సత్కారం 

చిన్నారుల చేతుల మీదుగా సంప్రదాయానికి సత్కారం

ఖిల్లా పాఠశాలలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

నిజామాబాద్: గవర్నమెంట్ ప్రైమరీ ఖిల్లా పాఠశాలలో తెలంగాణ సంప్రదాయ పండగ బోనాలు చిన్నారుల సందడి మధ్య ఘనంగా నిర్వహించారు. చిన్నారులు అందంగా ముస్తాబు కావడంతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి

చిన్నారులతో పాటు పోతరాజుల విన్యాసాలు అందరిని అలరించగా, విద్యార్థుల తల్లులు తమ పిల్లల నెత్తిన బోనాలను ఉంచి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కోరుకున్నారు.

సంప్రదాయంపై అవగాహన

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌమ్య మాట్లాడుతూ, “విద్యార్థి దశ నుంచే మన తెలంగాణ పండగల ప్రాముఖ్యతను పరిచయం చేయాలి. మన రాష్ట్ర చరిత్ర, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియజేయడం అవసరం” అని అన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుచిత్ర, తల్లులు తమ్మలి మాధవి, లావణ్య, భాను, లక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులు సహస్ర, రిత్విక్, సాత్విక్, మనస్విని, తమ్మలి సహస్ర బోనాలతో అందరినీ ఆకట్టుకున్నారు.

పండగ వాతావరణంలో విద్యార్థులు ఆనందంగా పాల్గొనగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ బోనాల పండుగను విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment