జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సంప్రదాయ గద (మోసే దండు) వ్యాయామాన్ని ప్రాచుర్యం చేస్తూ, యువత శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు.
శారీరక దారుఢ్యం గద వ్యాయామం ద్వారా శరీర ధృడత, సమతౌల్యం, మరియు శక్తి పెరుగుతుంది.పర్యావరణహితం వెదురు (బ్యాంబు) లేదా స్థానికంగా లభించే జామయిల్ కర్ర,మట్టి కుండలతో తక్కువ ఖర్చుతో గదలను తయారు చేయవచ్చు. ఉపాధి అవకాశాలు ఈ గద తయారీ ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయి. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రోత్సహం స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, యువతకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
ఈ విధంగా, సంప్రదాయ వ్యాయామ పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఉపాధికి మార్గాన్ని సూచించారు.
సాంప్రదాయ గద వ్యాయామం ఆరోగ్యంతో పాటు ఉపాధి
