*వేములవాడ: తిప్పాపురం బస్టాండ్ వద్ద ట్రాఫిక్ జామ్*
వేములవాడ డిసెంబర్ 20, ప్రశ్న ఆయుధం.
వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ వద్ద ప్రతి రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్డు, అస్తవ్యస్తంగా వస్తున్న ఆర్టీసీ బస్సులు, వాహనదారుల సమన్వయ లోపం దీనికి కారణమవుతోంది. దీనిపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.