ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

*డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రజలు మద్యం సేవించి*

*- వాహనాలు నడపకూడదు ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి*

 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 16 (ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ నగరంలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రసాద్ మాట్లాడుతూ—మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, నిరపరాధుల ప్రాణాలు కూడా బలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మద్యం ప్రభావంతో వాహనాలు నడపడం వల్ల చాలామంది అంగవైకల్యం చెంది జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇకనైనా ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్త పడాలని కోరారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కోర్టులో హాజరు తప్పదనీ, దండంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పి. ప్రసాద్ హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న ఈ చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now