ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
– గజ్వేల్ సిఐ బి సైదా
గజ్వేల్, 16 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం నాడు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సిఐ బి సైదా ఆధ్వర్యంలో యువకులు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ల డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనాలు నడిపేటప్పుడు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లు కలిగి ఉండాలని తెలిపారు.