*: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం*
ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.