రాక్ వుడ్స్ స్కూల్‌ లో విషాదం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రాక్ వుడ్స్ స్కూల్‌ లో విషాదం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నాలుగో అంతస్తు నుంచి దూకి విద్యార్థి మృతి; స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు

మేడ్చల్ జిల్లా పోచారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని యంనంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాక్ వర్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ లో ఇంటర్ రెండో సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న అభి చేతన్ రెడ్డి (17) అనే విద్యార్థి కళాశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం తరగతులు జరుగుతున్న సమయంలో జరిగింది.

[వివరాలు]

యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి కుమారుడైన అభి చేతన్, గురువారం మధ్యాహ్నం తరగతులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా నాలుగో అంతస్తు నుండి దూకాడు. సహ విద్యార్థులు, సిబ్బంది వెంటనే అతన్ని మేడిపల్లిలోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

తల్లిదండ్రుల ఆవేదన – యాజమాన్యంపై ఆగ్రహం:

తమ కుమారుడి మృతికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నాలుగో అంతస్తు నుండి దూకేంతవరకు స్కూల్ యాజమాన్యం ఏం చేసింది? సీసీ కెమెరాలు లేవా?” అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపించారు.

స్కూల్ యాజమాన్యం వివరణ:

కాగా, స్కూల్ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ, విద్యార్థి అభి చేతన్ గత కొన్ని నెలలుగా తరగతులకు సక్రమంగా హాజరు కాలేదని, ఈ విషయంపై తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. విద్యార్థి మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు గుర్తించినట్టు స్కూల్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు:

ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, ఉపాధ్యాయుల వేధింపులు లేదా మానసిక ఒత్తిడి వంటి అంశాలపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. విద్యార్థి మరణం వెనుక నిజమైన కారణాలు విచారణలో పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉంది. యువ విద్యార్థి ఆత్మహత్య స్థానికులను, సహ విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment