*రైతుల ఆదాయం పెంచుకోవడానికి శిక్షణ శిబిరం*
*రైతులు సంఘంగా ఏర్పడాలి*
*జాతీయ మొక్కల పరిరక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మరియదాస్ కెవికె సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు*
*జమ్మికుంట జులై 18 ప్రశ్న ఆయుధం*
రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా గోదాంలో నిలువ చేసుకొని ఉన్నట్లయితే అధిక లాభం వస్తుందని జాతీయ మొక్కల పరిరక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మరియాదాస్ అన్నారు శుక్రవారం రోజున కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో డబ్ల్యూ డి ఆర్ ఏ( వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులారిటీ అథారిటీ) రైతులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది కార్యక్రమానికి హైదరాబాదులోని జాతీయ మొక్కల పరిరక్షణ సంస్థ డైరెక్టర్ మరియదాస్ పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరుకాలం పండించిన పంటను తక్కువ రేటుకు అమ్ముకోకుండా గోదాంలో నిలువ చేసుకొని ఆధ్వర్యంలో ధాన్యం విలువలో 75% వరకు రైతులు నెగోషియబుల్ రిసిప్ట్ తీసుకొని బ్యాంకులో పెట్టి రుణము తీసుకొని మళ్లీ మార్కెట్లో ధాన్యానికి తగిన రేటు వచ్చిన తర్వాత అమ్ముకొని రుణం తీసుకోవచ్చని తెలిపారు అలాగే ధాన్యం నిలువలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎలుకల నివారణ పాటించవలసిన పద్ధతుల గురించి వివరించారు అనంతరం కె వి కె సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ధాన్యం పండించిన తర్వాత మార్కెట్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని రైతులు సంఘంగా ఏర్పడి గోదాములలో నిలువ చేసుకొని అమ్ముకుంటే రైతులకు ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో కె వి కె శాస్త్రవేత్తలు ఏ ప్రశాంతి డి శ్రీనివాస్ రెడ్డి 50 మంది రైతులు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు