*పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ*
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ సెప్టెంబర్-27
పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మరియు శుక్రవారం రెండు రోజులపాటు మండలకేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో కౌమార దశలో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్ళను ఏవిధంగా ఎదుర్కోవాలి, ఒత్తిడిలో కూడిన పరిస్థితులను ఆదిగమించడానికి నైపుణ్యలను అభివృద్ధి చేయడం, అలాగే భావొద్వేగాలను గుర్తించడం మరియు నియంత్రించడం ద్వారా ప్రమాదకర ప్రవర్తనలకు విద్యార్థుల ప్రతిఘటనను బలోపేతం చేయడం, స్వీయ అవగాహన మరియు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిడిద్దడం వంటి అంశాల మీద శిక్షకురాలు డాక్టర్ లక్ష్మి మూర్తి పిట్లం, నిజాంసాగర్,
పెద్ద కొడప్గల్, మొహమ్మద్ నగర్ మండలాలకు చెందిన 36 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో జిల్లా కొ ఆర్డినేటర్ నారాయణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావ్, మండల విద్యధికారి దేవీసింగ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాశిరెడ్డి, జోన్ చైర్మన్ కిషన్, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి బాలు, సభ్యులు బెజగం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.