సామర్థ్య నిర్మాణం పై ఉపాధ్యాయులకు శిక్షణ

*సామర్థ్య నిర్మాణం పై ఉపాధ్యాయులకు శిక్షణ*

*హుజురాబాద్ మే 19 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ మండలం లో పనిచేస్తున్న ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం లకు అండ్ ఎస్ జి టి ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల ఇన్-సర్వీస్ శిక్షణ ఇవ్వనున్నట్లు మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం రోజున మండల మానవ వనరుల కేంద్రం లో శిక్షణ కి రిసోర్స్ పర్సన్స్ తో ముందస్తు ప్రణాళిక వేసుకొని అంశాలను చర్చించారు ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ లేదని ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని పాల్గొనేవారి హాజరును తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ పర్యవేక్షిస్తుందని కాబట్టి చెక్ ఇన్ చెక్ అవుట్ సమయం చాలా ముఖ్యమని శిక్షణలు ఒకే దశలో నిర్వహించ బడతాయని ఏ ఉపాధ్యాయునికీ మినహాయింపు లేదని జూలై 2025 వరకు పదవీ విరమణ చేయబోయే ఉపాధ్యాయులకు శిక్షణ నుండి మినహాయింపు ఉందని ఉపాధ్యాయులు తమ బోధనా సబ్జెక్టు యొక్క పాఠ్యపుస్తకాలను విధిగా తీసుకురావాల్సిందిగా అయన కోరారు. కార్యక్రమం లో రిసోర్స్ పర్సన్స్ గాజుల ఆంజనేయులు, పత్తేo శ్రీనివాస్, ముశం సత్యరాజం, దానెంపల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్, దోమల సదానందం, సాహెదా సల్మా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now