Site icon PRASHNA AYUDHAM

ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

IMG 20250724 WA1891

తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేయడంతో పాటు రాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌ ట్రెయినీ ఐఏఎ్‌సలకు సబ్‌ కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ సంయుక్త కార్యదర్శిగా ఐషా మస్రత్‌ ఖానమ్‌కు బాధ్యతలు అప్పగించారు. హనుమంత్‌ కె.జెండగేను సివిల్‌ సప్లై డైరెక్టర్‌గా నియమించి, చీఫ్‌ రేషనింగ్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న ముజామిల్‌ ఖాన్‌ను జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.అదేవిధంగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్‌ ట్రెయినీ ఐఏఎ్‌సలకు ప్రభుత్వం సబ్‌ కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఉమా హారతిని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు, అజ్మీరా సంకేత్‌ కుమార్‌ను నిర్మల్‌ జిల్లా భైంసాకు, అభిజ్ఞాన్‌ మాల్వియాను నిజామాబాద్‌ ఆర్మూర్‌కు, అజయ్‌ యాదవ్‌ను ఖమ్మం జిల్లా కల్లూరుకు, మృణాల్‌ శ్రేష్ఠను భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి, మనోజ్‌ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి సబ్‌ కలెక్టర్లుగా నియమించింది.

Exit mobile version