* కాలం చెల్లిన నకిలీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ రాయితీలు…?
పైగా బదిలీలు ప్రమోషన్లు….?
* ఖమ్మం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి…?
* వివరాలు అడిగితే… విలేకరులపై ఒంటి కాలు పై లేచిన ఓ అవినీతి డాక్టర్…?
* ఆరోపణలు నిజం కాదు… 2014 తర్వాత సీఎం కేసీఆర్ అంటూ రాయండి చూద్దాం… రాసుకోండి.. ఏం రాసుకుంటారు…?
* సూర్యాపేట వివరాలు గోప్యమట… కేవలం ఖమ్మం జిల్లా సమాచారం మాత్రమే అడగాలట…?
* విలేకరుల ఎడిటర్లు, సీఈవోల ఫోన్ నెంబర్లు అడ్రస్ ఇస్తే చూసుకుంటాడట…?
* ఖమ్మం కలెక్టరేట్లోని డిఎంహెచ్వో కార్యాలయంలో వీరంగం వేసిన ఓ అవినీతి డాక్టర్…?
* ఛాంబర్ లోని ఉద్యోగులను రెచ్చగొట్టి ఉసిగొల్పే ప్రయత్నం…?
* సూర్యాపేటలో కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త..?
ఖమ్మం తెలంగాణ డిసెంబర్ 21:
ఖమ్మం జిల్లాలో పవిత్రమైన ఉద్యోగ ధర్మం నిర్వహించే ఓ ప్రభుత్వ డాక్టర్ వ్యవహరించిన తీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కేవలం 25% అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్ సృష్టించి ఆ సర్టిఫికెట్ను రాజమార్గంగా ఎంచుకొని ప్రమోషన్లు రాయితీలు, బదిలీలు లాంటి వ్యవహారాలలో ఉపయోగించుకొని లబ్ధి పొందిన వైనంపై అనేక ఫిర్యాదులు విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు వైద్యుడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా వ్యవహరించే సమయంలో 25% అంగవైకల్యం కలిగిన మ్యానువల్ సర్టిఫికెట్తో లబ్ధి పొందుతున్నట్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు డాక్టర్ ఈ దృవీకరణను అడ్డం పెట్టుకొని ప్రమోషన్లు బదిలీలు రాయితీలు పొందినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మాన్యువల్ దృవీకరణలో 25% వైకల్యం కలిగినట్లుగా సర్టిఫికెట్ను పొంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ రాయితీలు ఇతర లబ్ధిని పొందినట్లు ఓ సామాజిక కార్యకర్త జూన్ 10 2024లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యము ఉన్నదని తెలుస్తోంది. సదరు అవినీతి డాక్టర్ 2013 నుండి 2022 డిసెంబర్ వరకు 2000 రూపాయల అలవెన్స్ లు ఐటి రాయితీలు బదిలీలు పదోన్నతులు పొందుతున్నట్లు సూర్యాపేట జిల్లా సామాజిక కార్యకర్త సమగ్ర వివరాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. మాన్యువల్ సర్టిఫికెట్స్ వికలాంగుల వయోవృద్ధుల శాఖ జీవో ఎమ్ ఎస్ నెంబర్31 అనుసరించి డిసెంబర్ 1 2009న మ్యానువల్ సర్టిఫికెట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా 2010 నుండి సదరం సర్టిఫికెట్లు పొంది 40% పైగా వైకల్యం ఉన్న వారికి మాత్రమే వర్తించే రాయితీలు పొందుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా 2013 సంవత్సరంలో పొందిన మ్యానువల్ సర్టిఫికెట్ను అడ్డం పెట్టుకొని తనకున్న అధికార బలంతో దర్జాగా రాయితీలు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆ డాక్టర్ కు ఎటువంటి వైకల్యం లేనట్లు కొందరు ఆరోపిస్తున్నారు.
*కాగా సదరు వైద్యుడు రిజిస్ట్రేషన్ నెంబర్ 37032 ప్రకారం ఏప్రియల్ 18 2013 సంవత్సరంలో 372 నెంబర్ ప్రకారం అక్రమంగా అడ్డగోలుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అంగవైకల్యం సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం అందింది.
*2014 తర్వాత సీఎం కేసీఆర్ ఇప్పుడు సీఎం కేసీఆర్ అని రాస్తావా..? ఏం రాసుకుంటావో రాసుకో..? చూసుకుంటా…?
అంటూ బ్లాక్మెయిల్ కు దిగిన ఆ డాక్టర్….?
కాగా ఆ సర్టిఫికెట్ తో ప్రభుత్వ రాయితీలు ప్రమోషన్లు తోపాటు ఐటీ రాయితీలు పొందుతున్న ఆ వైద్యుడు ను వివరణ కోరేందుకు తెలంగాణ పత్రిక ప్రతినిధి ఖమ్మం కలెక్టరేట్లోని డిఎంహెచ్వో ఛాంబర్ లో విధులు నిర్వహిస్తున్న సదరు డాక్టర్ వద్దకు వెళ్లి అనుమతి తీసుకొని వివరణ అడుగుతుండగా సదరు డాక్టర్ ఆవేశంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అని రాస్తారా? ఆరోపణలు కాదు రుజువులు కావాలని అని తనతో అంటున్నా డాక్టరు ఆధారాలు ఉన్నాయి.? 25 శాతం వైకల్యం ఉన్నమాట వాస్తవం కాదా? రాయితీలు పొందటం లేదా? అంటూ ప్రశ్నించేసరికి సదరు డాక్టర్ ఒంటి కాలు పై లేచి మీ పత్రిక ఏది మీ ఎడిటర్ సీఈఓ ఎవరు? పేరు చెప్పండి నెంబర్లు ఇవ్వండి ?నేను చూసుకుంటాను? ఏం రాసుకుంటారో రాసుకోండి? కాగా మళ్లీ కలగజేసుకున్న ప్రతినిధి సూర్యాపేటలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు వ్యవహారం ప్రస్తావించగా మరింత కోపంతో ఊగిపోతూ సూర్యాపేట జిల్లా వివరాలు మీకు అవసరం లేదు.? సుమారు 5 నెలల క్రితం ఇక్కడికి వచ్చాను ఇక్కడ విషయాలు మాత్రమే అడగండి అసలు నేను చెప్పను ఏమి రాసుకుంటారో.. రాసుకోండి… చూసుకుంటాను అంటూ “వీరంగం” వేశారు. పైగా తన చాంబర్లోని ఉద్యోగులను సిబ్బందిని ఉసి గొల్పే చర్యలకు దిగటం విశేషం. కాగా సదరు డాక్టర్ వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని తెలంగాణ పత్రిక ప్రతినిధి దృశ్యాలను రికార్డ్ చేశారు.
కాగా ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళావతిని వివరణ కోరగా వికలాంగుల సర్టిఫికెట్ తో రాయితీలు ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పొందలేదని సర్టిఫికెట్ వ్యవహారం తన దృష్టికి రాలేదని ఆమె చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి అక్రమ మార్గంలో అడ్డగోలుగా నకిలీ దృవీకరణలు పొంది చలామణి అవుతున్న సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.