ట్రాన్స్ఫార్మర్ పేలుడు.. ఎగిసి పడిన మంటలు !
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
కామారెడ్డి జిల్లా:సదాశివనగర్ మండలం వజ్జపల్లిలో విద్యుత్ అధికారుల తాపత్రయం మరోసారి బహిరంగమైంది. గ్రామానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ శుక్రవారం ఉదయం ఒక్కసారిగా పేలి మంటలు ఎగిసిపడ్డాయి.రైతులు తెలిపిన వివరాల మేరకు.. అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్కి అవసరానికి మించిన కనెక్షన్లు ఇవ్వడంతో ఓవర్లోడ్ అయ్యి మంటలు చిమ్మిందన్నారు.
“ఇదేం కొత్త కాదయ్యా.. గతంలోనూ ఎన్ని సార్ల చెప్పిన.. స్పందన లేకపోయింది” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదని తీవ్రంగా తప్పుబడుతూ, నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.