రవాణా శాఖ మంత్రికి సమస్యలు విన్నవించిన రవాణా శాఖ అధికారులు 

రవాణా శాఖ మంత్రికి సమస్యలు విన్నవించిన రవాణా శాఖ అధికారులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ లు కామారెడ్డి కి శుక్రవారం వచ్చిన సందర్భంగా వారిని షబ్బీర్ అలీ నివాసంలో కలిసి రవాణా శాఖ అధికారులు తమ సమస్యలు మంత్రికి విన్నవించుకున్నారు. రహదారి భద్రత ను పెంపొందించడానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ రవాణా శాఖ అధికారులకు హామీ ఇచ్చారు.

అనంతరం రవాణా శాఖ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment