కామారెడ్డిలో రవాణా శాఖ మంత్రి జన్మదిన వేడుకలు
కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని రవాణాశాఖ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డీటీవో నాగలక్ష్మి, ఎంవీ ఐ ఇజాజాహ్మద్, కార్యాలయ సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.